ఉద్యోగుల వయోపరిమితి పెంచడంపై సీఎం కేసీఆర్ సానుకూల వ్యాఖ్యలు
- త్వరలోనే నిర్ణయం ఉంటుందన్న కేసీఆర్
- తప్పకుండా పెంచుతామని వెల్లడి
- పీఆర్సీ నివేదిక తెప్పించి కొద్దిమేర జీతాలు కూడా పెంచుతామని హామీ
ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడంలేదని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రూ.5 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిమితులను బట్టి తృణమో పణమో జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఇక, 57 ఏళ్లు దాటిన వాళ్లకు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తామన్న హామీని కూడా మార్చి నుంచి అమల్లోకి తెస్తామని చెప్పారు.