రెచ్చిపోయిన పిచ్చి కుక్క .. 3 గంటల్లో 50 మందికి కాట్లు!
- హైదరాబాద్, అమీర్‌పేట ప్రాంతంలో ఘటన
- జనంపై ఎగబడిన పిచ్చికుక్క
- ఆసుపత్రులకు పరుగులు తీసిన బాధితులు
అమీర్‌పేటలోని ధరంకరణ్ రోడ్డు, శివబాగ్, సత్యం థియేటర్, సోమాజీగూడలోని సీఎం క్యాంపు కార్యాలయం ఎదురు వీధుల్లో ఈ పిచ్చి కుక్క హల్‌చల్ చేసింది. విషయం తెలిసిన జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పిచ్చికుక్క కోసం గాలింపు మొదలుపెట్టారు. అయితే, అప్పటికే స్థానికులు కొందరు సత్యం థియేటర్ వద్ద కనిపించిన పిచ్చికుక్కను కొట్టి చంపారు. ఇక, కుక్క కాటుకు గురైన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. కుక్క దాడిలో గాయపడిన వారిలో పలువురు విద్యార్థులు, ఓ వైద్యుడు కూడా ఉన్నారు.