జై ఇండియన్ ఆర్మీ... మోదీ షేర్ చేయగా, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

  • హిమాలయాల్లో మంచు వర్షం
  • గర్భిణిని ఆసుపత్రికి చేర్చిన 100 మంది సైనికులు
  • తల్లీ, బిడ్డా సుఖంగా ఉండాలని కోరిన మోదీ
భారత సైన్యానికి జేజేలు కొడుతూ, నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. హిమాలయ పర్వతాల్లోని ఓ గ్రామంలో నిండు గర్భిణిగా ఉన్న షమీమా అనే మహిళకు పురిటి నొప్పులు ప్రారంభం కాగా, భారీ మంచు తుపాను మధ్య 4 గంటల పాటు 100 మంది సైనికులు, 30 మంది స్థానికులు ఆమెను మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు. మంచు భారీగా పడుతూ ఉండటంతో వీరి ప్రయాణం ఎంతో ప్రయాసతో సాగింది. ఆసుపత్రిలో ప్రసవం జరిగిందని, తల్లి, బిడ్డా క్షేమమేనని చెబుతూ భారత సైన్యంలోని చిన్నార్ క్రాప్స్ విభాగం ఈ వీడియోను పోస్ట్ చేసింది.

ఇక దీన్ని షేర్ చేసిన మోదీ, సైనికుల మానవతా స్ఫూర్తికి జేజేలు పలికారు. ప్రజలకు సాయం కావాల్సి వస్తే, ఆర్మీ ముందుంటుందని, తమకు చేతనైనంత సాయం చేసేందుకు సైనికులు ఎన్నడూ వెనుకంజ వేయరని అన్నారు. భారత సైన్యాన్ని చూసి తనకు గర్వంగా ఉందని తెలిపారు. షమీమా ఆరోగ్యం బాగుండాలని కోరుతూ, ఆమె బిడ్డకు ఆశీస్సులు తెలిపారు. మంచుకొండల్లో సైనికులు నడుస్తున్న వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Pregnent
Himalayas
Viral Videos
Narendra Modi
Army
India

More Telugu News