తీపితోనే కాదు.. ఉప్పుతోనూ మధుమేహ ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!
- శరీరంలోని ఇన్సులిన్‌ను నిరోధిస్తున్న సోడియం
- రోజుకు 1.25 చెమ్చాల కంటే ఎక్కువ తింటే మధుమేహ ముప్పు
- తాజా అధ్యయనంలో వెల్లడి
ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే, రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు (1.25 చెమ్చాలు), అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందని పేర్కొన్నారు.
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరుగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని వివరించారు. కాబట్టి ఉప్పు కూడా ముప్పు చేస్తుందని, కాబట్టి వీలైనంతగా దానికి దూరంగా ఉండాలని సూచించారు. ఏ రకంగానూ రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.