చంద్రబాబు ఆస్తుల ధర తగ్గకుండా అంతా అడ్డం నిలుచోవాలట: విజయసాయి రెడ్డి ఎద్దేవా
Add ap7am to your home Screen

చంద్రబాబు ఆస్తుల ధర తగ్గకుండా అంతా అడ్డం నిలుచోవాలట: విజయసాయి రెడ్డి ఎద్దేవా

  • ఉద్యోగులు సంక్రాంతి సెలవులు తీసుకోరాదన్న చంద్రబాబు
  • మీ బినామీల కోసం విధుల్లోకి రావాలా?
  • ఉద్యోగులను రెచ్చగొడుతున్నారన్న విజయసాయి
సచివాలయం ఉద్యోగులు సంక్రాంతి సెలవులు తీసుకోకుండా విధుల్లోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"చంద్రబాబు లాంటి అవకాశవాది ఎక్కడా కనిపించడు. తన స్వార్థం కోసం, బినామీల కోసం అందరూ వీధుల్లోకి రావాలట. నేను పోరాటం చేస్తుంటే విద్యార్థులు ఇళ్లలో కూర్చుంటారా అని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడేమో ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఆస్తుల ధర పడిపోకుండా అంతా అడ్డం నిల్చోవాలట" అని ఎద్దేవా చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Twitter

More Telugu News