ద్వారంపూడి వ్యాఖ్యలు, జనసైనికులపై దాడి పట్ల స్పందించిన పవన్ కల్యాణ్
- పవన్ ను అసభ్య పదజాలంతో విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే
- నిరసన తెలిపిన జనసేన కార్యకర్తలపై రాళ్ల దాడి
- లేఖ రాసిన పవన్ కల్యాణ్
తప్పును తప్పు అని చెబుతున్న వారిపై అరాచక శక్తులతో దాడి చేయిస్తే జన సైనికులు వెనుకంజ వేస్తారని భావించవద్దని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలకు అన్యాయం చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితే వస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడ వస్తానని హెచ్చరించారు.