ప్రియురాలిని దూరం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు
- రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లులో ఘటన
- ప్రియురాలిని దూరం చేశారని ఆవేదన
- 8 గంటలపాటు హంగామా
ఉదయం 5:30 గంటలకు టవర్ ఎక్కిన పాండు.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు టవర్ వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాండు ఎట్టకేలకు కిందికి దిగాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.