కశ్మీర్‌లో చొరబాటుకు సిద్ధంగా 300 మంది ఉగ్రవాదులు: నిఘా వర్గాలు
- పాక్ నిర్మించిన బంకర్లలో తలదాచుకున్న 300 మంది ఉగ్రవాదులు
- పాష్టో భాషలో మాట్లాడుకుంటున్న ఉగ్రవాదులు
- మార్చి, ఏప్రిల్ నెలల్లో చొరబాటుకు రెడీ
బంకర్లలో ఉన్నవారంతా తాలిబన్ ఉగ్రవాదులేనని, వారంతా పాష్టో భాషలో మాట్లాడుకుంటుండడాన్ని భారత జవాన్లు గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. మంచు కరగడం ప్రారంభమయ్యే మార్చి, ఏప్రిల్ నెలల్లో చొరబాటుకు యత్నించే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ నివేదికతో కేంద్రం అప్రమత్తమైంది. సరిహద్దు వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది.