సీఏఏ చట్టబద్ధమైందని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్.. విచారణకు స్వీకరించమన్న సుప్రీంకోర్టు
- ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పిటిషన్ పై విచారణ చేపట్టం
- ఆందోళనలు తగ్గిన తర్వాతే విచారణకు స్వీకరిస్తాం
- చట్టం చెల్లుబాటును నిర్ధారించడమే కోర్టు విధి
- అది రాజ్యంగబద్ధమైందని కోర్టు ప్రకటించడం కుదరదు
సీఏఏ రాజ్యాంగబద్ధమైందే అని ప్రకటించి, అన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసేలా ఆదేశించాలని వినీత్ దండా అనే న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించిన నేపథ్యంలో బోబ్డే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పిటిషన్ ను విచారణకు తీసుకోమని బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చట్టం చెల్లుబాటును నిర్ధారించడం వరకే కోర్టు విధి అంటూ, అది రాజ్యంగబద్ధమైందని కోర్టు ప్రకటించడం కుదరదని ధర్మాసనం పేర్కొంది. దేశంలో సీఏఏపై జరుగుతోన్న ఆందోళనలు తగ్గిన తర్వాత ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.