పిల్లల భోజన పథకంలో మెనూ ఇదే.. చరిత్రలో ఏ సీఎం ఇలా చేసి ఉండడు: జగన్

  • పిల్లలెవరూ రోజూ ఇదే తిండేనా అని అనుకోకూడదు
  • మెనూ కార్డును తయారు చేశాం
  • రూ. 200 కోట్లు ఎక్కువ ఖర్చైనా భరిస్తాం
అమ్మఒడి పథకాన్ని కాసేపటి క్రితం చిత్తూరులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల చదువే కాకుండా వారు తినే ఆహారానికి సంబంధించిన మధ్యాహ్న భోజనం పథకం మెనూను కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా జగన్ మాత్రమే ఉంటాడని నవ్వుతూ అన్నారు.

మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం చేసే పిల్లలెవరూ రోజూ ఇదే తిండేనా? అని అనుకోకూడదని చెప్పారు. అందుకే పిల్లల కోసం మెనూ కార్డును తయారు చేశామని తెలిపారు. వారంలోని ఆరు రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఏముంటాయో ఆయన వివరించారు. పిల్లలకు ఏం పెడితే బాగుంటారని ఆలోచన చేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికీ ఉండదని... పిల్లల కోసం ఇంత ఆలోచన చేశామని చెప్పారు. రూ. 200 కోట్ల ఖర్చు ఎక్కువైనా భరిస్తామని తెలిపారు.

మధ్యాహ్న భోజన పథకం మెనూ:
సోమవారం: అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీట్
మంగళవారం: పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్
గురువారం: కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్.
Go Back to Shorts
Jagan
YSRCP
Ammavodi
Mid Day Meal

More Telugu News