Vijay Sai Reddy: ఇది ప్రజల కర్మ కాకపోతే మరేంటి?: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపాటు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని, అమరావతిని తీసేస్తే, యువత ఆందోళనలు చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్టేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు, సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధలు కావాలా? మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?" అని ఆయన అన్నారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Twitter
Chandrababu
Amaravati

More Telugu News