'ది హిందూ' పత్రిక బయటపెట్టింది... పాతాళానికి జారిపోయావు బాబూ: విజయసాయి రెడ్డి
Add ap7am to your home Screen

'ది హిందూ' పత్రిక బయటపెట్టింది... పాతాళానికి జారిపోయావు బాబూ: విజయసాయి రెడ్డి

  • 'బీసీజీ' నివేదికపై అవాస్తవాలు
  • 12 సార్లు సమాచారాన్ని మార్చే ప్రయత్నం
  • ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయమై ఎంతో రీసెర్చ్ చేసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ను అవమానించాలని, అప్రతిష్ఠ పాలు చేయాలని చంద్రబాబు చేసిన కుట్ర బయట పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, 12 సార్లు సమాచారాన్ని మార్చాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టిందని అన్నారు.

"బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపును అప్రతిష్ఠ చేసే కుట్రకు చంద్రబాబు నాయుడు తెగబడ్డాడు. బిసిజి వికీపీడియా ప్రొఫైల్ ను ఎడిట్ చేయించి సిఎం జగన్ మోహన్ రెడ్డికి 50% వాటాలున్నాయని రాయించాడు. 12 సార్లు ఇలా సమాచారాన్ని మార్చే ప్రయత్నం చేశారని హిందూ పత్రిక బయట పెట్టింది. పాతాళానికి జారిపోయావు బాబూ!" అని ఆయన అన్నారు. 
Vijay Sai Reddy
Twitter
Chandrababu

More Telugu News