రాజధాని విషయంలో తన వైఖరిని కుండబద్దలుగొట్టిన గంటా శ్రీనివాసరావు
- అధిష్ఠానం నుంచి మాకు మినహాయింపు ఉంది
- ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను స్వాగతిస్తాం
- అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా చేయడాన్ని సమర్థిస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు చెప్పారు. అనంతరం దానిని పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి పంపినట్టు చెప్పారు. ఈ విషయాన్ని హైకమాండ్ అర్థం చేసుకుని తమకు మినహాయింపు ఇచ్చిందని గంటా పేర్కొన్నారు.