మధ్యలో మహేశ్ బాబు... అటు చిరంజీవి, ఇటు విజయశాంతి... హుషారుగా సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
- ప్రారంభమైన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
- హాజరైన మహేశ్ బాబు, చిరంజీవి, విజయశాంతి
- ఉత్సాహంగా కొనసాగుతున్న ఈవెంట్
కాగా, ఎల్బీ స్టేడియంలోకి చిరంజీవి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అభిమానుల హోరుతో పరిసరాలు దద్దరిల్లిపోయాయి. ఈ సందర్భంగా చిరంజీవికి మహేశ్ బాబు ఆత్మీయస్వాగతం పలికారు. ఇక అభిమానులు వేలాదిగా హాజరవడంతో ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రం కనిపిస్తోంది. ఈ సినిమా ఈవెంట్ మహేశ్ బాబుకు చెందినదైనా మెగాస్టార్ చిరంజీవిపై ప్రత్యేకంగా ఎ.వి ప్రదర్శించడం విశేషంగా చెప్పాలి.