మాకే పాపం తెలియదు.. కోర్టులో సమత హత్యాచారం కేసు నిందితులు
- తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపణ
- చార్జ్‌షీట్ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలు అడిగిన న్యాయస్థానం
- కేసు విచారణ ఆరో తేదీకి వాయిదా
చార్జిషీట్ ఆధారంగా రూపొందించిన 52 ప్రశ్నలను న్యాయస్థానం నిందితులకు సంధించింది. అయితే, తాము నిర్దోషులమని, తమకు, ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ ముఖ్దూంలు న్యాయస్థానానికి తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఈ నెల ఆరో తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.