Anajali Devi: అప్పట్లో 'చెంచులక్ష్మి' నుంచి భానుమతిని తొలగించారట!

షార్ట్స్‌లో చూడండి
అక్కినేని నాగేశ్వరరావు .. అంజలీదేవి కాంబినేషన్లో వచ్చిన 'చెంచులక్ష్మి' ఆ ఇద్దరి కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. బీఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1958లో ప్రేక్షకులను పలకరించి విజయవిహారం చేసింది. అలాంటి ఈ సినిమాను గురించిన ఒక విషయాన్ని, సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు.

'చెంచులక్ష్మి' సినిమాకి సంబంధించి తొలి రోజుల్లో వచ్చిన పోస్టర్స్ లో అక్కినేని సరసన భానుమతి కనిపించారు. ఆ తరువాత వచ్చిన పోస్టర్స్ లో అక్కినేని సరసన అంజలీదేవి కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు. భానుమతిగారు ముక్కుసూటి మనిషి .. ఆమెతో షూటింగ్ అంతతేలిక కాదు. 'చెంచులక్ష్మి' విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురైందో తెలియదుగానీ, కొన్ని రీళ్లు షూట్ చేసిన తరువాత భానుమతిని తొలగించారు. ఆ స్థానంలో అంజలీదేవిని తీసుకున్నారు. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Anajali Devi
Bhanumathi

More Telugu News