Tamil Nadu: మందేసి చిందేసిన విద్యార్థులు.. కళాశాల నుంచి బహిష్కరణ!

షార్ట్స్‌లో చూడండి

 సరదాగా పార్టీయే కదా అని తేలికగా తీసుకుని కలిసి మద్యం సేవించిన నలుగురు విద్యార్థులను కళాశాల యాజమాన్యం బయటకు పంపితేగాని తాము చేసిన తప్పేమిటో వారికి తెలియరాలేదు.

వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలోని ఓ కళాశాలలో చదువుకుంటున్న నలుగురు విద్యార్థులు ఆరు వారాల క్రితం పార్టీ చేసుకున్నారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు బీరుతాగారు. దీన్ని ఓ తుంటరి విద్యార్థి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

అది చూసిన నెటిజన్లు మండిపడ్డారు. తమిళనాడులో 21 ఏళ్ల వయసులోపు ఉన్న వారు మద్యం సేవించడం చట్ట ప్రకారం నేరం. అది చాలదన్నట్లు అమ్మాయిలు కూడా మద్యం సేవించడంతో నెటిజన్లు ఆగ్రహెూదగ్రులవుతూ వారిపై చర్యకు డిమాండ్ చేశారు.

ఇది కాస్తా వైరల్ కావడంతో విషయం డిసెంబరు 27న కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రిన్సిపాల్ అంతర్గత విచారణకు ఆదేశించారు. విద్యార్థుల తీరు కళాశాలకు చెడ్డ పేరు తెచ్చేదిగా ఉండడంతో వారిని బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ బహిష్కరణ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది.

Go Back to Shorts
Tamil Nadu
nagapatnam
students

More Telugu News