కొత్త కథను సిద్ధం చేశాను: దర్శకుడు శ్రీను వైట్ల
- ఎన్నో హిట్లు ఇచ్చిన శ్రీను వైట్ల
- వరుసగా వెంటాడిన పరాజయాలు
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
తాజాగా ఆయన మాట్లాడుతూ ..'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా పరాజయం నిరాశ పరిచిన మాట వాస్తవమే. ప్రేక్షకుల అభిరుచి మారిపోయిందనే విషయాన్ని ఈ సినిమా నాకు స్పష్టం చేసింది. ప్రేక్షకులు ఏ స్థాయిలో కొత్తదనాన్ని కోరుకుంటున్నారనేది నాకు అర్థమైంది. అందువల్లనే కాస్త గ్యాప్ తీసుకుని మంచి కథను సిద్ధం చేసుకున్నాను. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లబడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమా ఎవరితో ఉంటుంది? .. ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రకటన త్వరలో ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు.