ఆయేషా మీరా అత్యాచారానికి గురైన డిసెంబర్ 27న ఆమె తల్లిదండ్రుల దీక్ష!
- విజయవాడలో 2007, డిసెంబరు 27న ఆయేషా మీరాపై హత్యాచారం
- 12 ఏళ్లు అవుతున్నా న్యాయం జరగలేదన్న ఆయేషా మీరా తండ్రి
- ఈ నెల 27న తెనాలిలోని గాంధీచౌక్ వద్ద సత్యాగ్రహ దీక్ష
తమ కూతురు చనిపోయి 12 ఏళ్లు అవుతున్నా తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ బాషా అన్నారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదని, ఆయేషా మీరాకు న్యాయం జరగలేదని ప్రజలు కూడా భావిస్తున్నారని అన్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. న్యాయాన్ని పరిరక్షిద్దాం, ఆడబిడ్డలను కాపాడుకుందామనే నినాదంతో పోరాటం జరుపుతామన్నారు. ఈ పోరాటంలో మహిళా సంఘాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటాయని వివరించారు.