చిరూ .. రజనీ ఈ రేంజ్ లో దూసుకెళతారని అనుకోలేదు: సీనియర్ హీరోయిన్ లత

  • రజనీ నా దగ్గర్లో కూర్చునేవారు కాదు 
  •  నేను అప్పటికే స్టార్ హీరోయిన్ ను 
  •  చిరంజీవి మంచివారన్న లత  
తెలుగు తెరపై అలనాటి అందాల కథానాయికగా మంచి మార్కులు కొట్టేసినవారిలో 'లత' పేరు కూడా కనిపిస్తుంది. తమిళంలో ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ .., తెలుగులో ఎన్టీఆర్ .. ఏఎన్నార్ లతో కలిసి ఆమె నటించారు. ఆ తరువాత రజనీతోను .. చిరంజీవితోను కలిసి నటించారు.

తాజాగా ఆ విషయాలను గురించి ఆమె మాట్లాడుతూ .."రజనీకాంత్ ఎంట్రీ ఇచ్చేటప్పటికే నేను అక్కడ పెద్ద హీరోయిన్ ను. అందువలన ఆయన నాకు దగ్గరలో కూర్చోకుండా కాస్త దూరంగా తిరిగేవారు. ఆయనతో మాటలు కలపడానికే మూడు రోజులు పట్టింది. వ్యక్తిత్వం విషయంలో రజనీ అప్పుడు ఎలా వున్నారో .. ఇప్పుడూ అలాగే వున్నారు. ఇక చిరంజీవితో కలిసి 'లవ్ ఇన్ సింగపూర్' చేశాను. చిరంజీవిగారు చాలా మంచివారు. రజనీ.. చిరంజీవి ఇద్దరూ కూడా ఈ రేంజ్ లో దూసుకెళతారని నేను ఎప్పుడూ అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Latha
Rajani
Chiru

More Telugu News