మరోసారి మాస్ లుక్ తో కనిపించనున్న సాయితేజ్
- 'ప్రతిరోజూ పండగే'తో హిట్ అందుకున్న తేజూ
- సెట్స్ పై 'సోలో బ్రతుకే సో బెటర్'
- దేవ కట్టాతో తదుపరి సినిమా
దేవ కట్టా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అంటున్నారు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే దేవ కట్టా ఒక కథను సిద్ధం చేశాడట. ఈ సినిమాలో తేజు మాస్ లుక్ తోనే కనిపించనున్నాడని అంటున్నారు. మొదటి నుంచి కూడా తేజూకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన చేసిన సినిమాలకి మాస్ ఆడియన్స్ నుంచి పడే మార్కులే ఎక్కువ. అందువలన తేజూ మరో మాస్ మూవీకి రెడీ అవుతుండటం ఆయన అభిమానులను ఖుషీ చేసే విషయమే.