కేఎస్ ఆర్టీసీ మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి.. నిందితుల కోసం వేట

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • విధులకు వెళ్తున్న కండక్టర్‌పై తెల్లవారుజామున యాసిడ్ దాడి
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

కర్ణాటక ఆర్టీసీకి చెందిన మహిళా కండక్టర్‌పై ఇద్దరు దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. వహనూరుకు చెందిన ఇందిరాబాయి పీణ్యా ప్రాంతంలోని 9వ డిపోలో కండక్టరుగా విధులు నిర్వర్తిస్తోంది.

నిన్న తెల్లవారుజామున 5:45 గంటల సమయంలో విధులకు హాజరయ్యేందుకు డిపోకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై యాసిడ్‌ పోసి పరారయ్యారు. యాసిడ్ మీద పడడంతో విలవిల్లాడిపోయిన బాధితురాలు కేకలు వేయడంతో  స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దాడికి గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Karnataka
KSRTC
woman conductor
acid attack

More Telugu News