చిరూ .. కొరటాల సినిమా అప్ డేట్స్
- ముగింపు దశకి చేరుకున్న ప్రీ ప్రొడక్షన్ పనులు
- కథానాయికగా తెరపైకి 'త్రిష' పేరు
- వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల
ఈ సినిమా షూటింగును 6 నెలలలో పూర్తిచేసి, ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో చిరంజీవి - కొరటాల వున్నారని అంటున్నారు. దాదాపు ఇదే తేదీ ఖరారు అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ మార్చుకున్నారు. తను ద్విపాత్రాభినయం చేయనున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు కూడా. వినోదం .. సందేశం కలగలిసిన ఈ సినిమాలో కథానాయికగా 'త్రిష' పేరు ఎక్కువగా వినిపిస్తోంది.