Twitter: ఫన్నీ ట్వీట్ షేర్ చేసిన కల్వకుంట్ల కవిత!

షార్ట్స్‌లో చూడండి
నిజామాబాద్ మాజీ లోక్ సభ సభ్యురాలు, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత, ఈ ఉదయం తన ట్విట్టర్ లో షేర్ చేసుకున్న ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన కుమారుడు ఈ ట్వీట్ ను తనకు పంపించాడని ఆమె చెప్పారు. ఇందులో 'మిస్టర్ బీన్' చిత్రం కనిపిస్తుండగా, వీకెండ్స్ ను ఉద్దేశించి, దానిపై ఓ కామెంట్ ఉంది. "నేను ఏమనుకుంటున్నానంటే... వారాంతాలు చైనాలో రూపుదిద్దుకున్నట్టున్నాయి. అందుకే అవి ఎక్కువ కాలం ఉండవు" అన్న కొటేషన్ ఉంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సరదాగా అభిప్రాయాలు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే కవిత, తనకు తారసపడిన సరదా కబుర్లను తరచుగా నెటిజన్లతో పంచుకుంటారన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Twitter
K Kavitha
Tweet
Mr Bean

More Telugu News