బోయపాటి మూవీలో బాలకృష్ణ సరసన సోనాక్షి సిన్హా
- బాలకృష్ణ తాజా చిత్రంగా రానున్న 'రూలర్'
- బోయపాటితో యాక్షన్ ఎంటర్టైనర్
- బాలీవుడ్ స్టార్స్ తో సంప్రదింపులు
యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితం కానున్న ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇక ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్ ను అనుకున్నారట. ఆయనతోను చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ఇద్దరి రాక వలన ఈ ప్రాజెక్టు క్రేజ్ మరింత పెరగడం ఖాయమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.