కోరుట్ల నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుపై అర్ధరాత్రి దాడి
- జగిత్యాల వద్ద దాడి
- కారులో వచ్చిన దుండగులు
- గాలిస్తున్న పోలీసులు
ఆ సమయంలో కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు బస్సుపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. దాడి జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు. ఘటనపై బస్సు డ్రైవర్ జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వేరే బస్సులో ప్రయాణికులను హైదరాబాద్ కు తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.