సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • మహేశ్ తో మరోసారి శ్రుతి హాసన్ 
  • పింక్ రీమేక్ లో నివేద థామస్ 
  • 'అసుర' రీమేక్ లో అభిరాం లేడట!  
  * గతంలో 'శ్రీమంతుడు' చిత్రంలో కలసి నటించిన మహేశ్ బాబు, శ్రుతి హాసన్ జంట మరోసారి జోడీ కట్టనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటించే చిత్రంలో  కథానాయికగా శ్రుతి హాసన్ నటించనున్నట్టు తెలుస్తోంది. 
*  హిందీలో హిట్టయిన 'పింక్' చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఓ కథానాయికగా నివేద థామస్ నటించనున్నట్టు తాజా సమాచారం. 
*  'అసుర' రీమేక్ లో తమ చిన్నబ్బాయి అభిరాం నటించనున్నట్టు వస్తున్న వార్తలను ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఖండించారు. ఈ వార్తలలో నిజం లేదని, అభిరాంను సోలో హీరోగా పరిచయం చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ప్రస్తుతం అభిరాం ముంబైలో నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.  
Go Back to Shorts
Shruti Hassan
Mahesh Babu
Rajanikanth
Pawan Kalyan

More Telugu News