అమరావతిలో డ్రోన్ కలకలం... లోకేశ్ కు తప్పిన ప్రమాదం!
- అమరావతిలో టీడీపీ నేతల నిరసన
- చిత్రీకరించేందుకు డ్రోన్ ను ప్రయోగించిన పోలీసులు
- అదుపు తప్పి, నేతల ముందు కుప్పకూలిన డ్రోన్
టీడీపీ ధర్నాను చిత్రీకరించేందుకు పోలీసులు కెమెరాను అమర్చిన డ్రోన్ ను ప్రయోగించారు. అది అదుపు తప్పి కుప్పకూలింది. టీడీపీ నేతలకు అత్యంత సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ, ఇది పడటంతో కొంత కలకలం రేగింది. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆపై టీడీపీ నేతలు అక్కడి నుంచి నిరసన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిపోయారు.