వివేకా హత్య కేసు: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి నాలుగవసారి సిట్ నోటీసుల జారీ
- ఇప్పటికే మూడుసార్లు నోటీసుల జారీ
- స్వగ్రామం దేవగుడిలోనూ అందుబాటులో లేని వైనం
- ఈసారి హాజరుకాకుంటే కేసు నమోదు తప్పదు
ఈ నోటీసులో బుధవారం జరిగే విచారణకు తప్పని సరిగా రావాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. సిట్ దర్యాప్తు వేగవంతం అయినప్పటి నుంచీ ఆదినారాయణరెడ్డి అందుబాటులో లేకుండాపోయారు. ఆయన స్వగ్రామం దేవగుడిలో సైతం జాడలేదు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని ఆయన రేపటి విచారణకు హాజరు అవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.