అత్యాచార నిందితుడిని కోర్టు ముందే చితక్కొట్టబోయిన న్యాయవాదులు.. వీడియో ఇదిగో
- మధ్యప్రదేశ్ లో ఘటన
- కోర్టులో విచారణకు వచ్చిన నిందితుడు
- న్యాయవాదుల దాడి
- రక్షించి తీసుకెళ్లిన పోలీసులు
మైనర్ బాలికపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణలో భాగంగా ఆ నిందితుడిని ఈ రోజు పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడిని చూసిన న్యాయవాదులు ఆగ్రహానికి గురై పిడిగుద్దులు కురిపించబోయారు. ఆ నిందితుడిని పోలీసులు రక్షించి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ఇటీవల దిశ ఘటనలోనూ.. నిందితులను తమకు అప్పగించాలని, వారి అంతం చూస్తామని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.