నేరస్థులు పేదలు, దళితులు అయితేనే శిక్షలు వేస్తున్నారు: సంధ్య తీవ్ర ఆరోపణలు
- ఉన్నావో నిందితుడిని ఎందుకు ఎన్ కౌంటర్ చేయలేదు
- ఆ బీజేపీ నేతను ఎన్ కౌంటర్ చేయాలని నేను కోరుతున్నాను
- మహిళలను రక్షించే విధానం ఇది కాదు
'2017లో జరిగిన ఉన్నావో అత్యాచారం ఘటన నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సెంగార్ ను కూడా ఇదే విధంగా ఎన్ కౌంటర్ చేయాలని నేను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను కోరుతున్నాను. అత్యాచార ఘటనల్లో ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని పక్క దారి పట్టించేందుకే ఇటువంటి ఎన్ కౌంటర్ లు చేస్తున్నారు. దేశంలోని చాలా అత్యాచార ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. మహిళలను రక్షించే విధానం ఇది కాదు' అని సంధ్య అన్నారు.