Kajal Agarwal: ప్రభాస్ మూవీలో అతిథి పాత్రలో కాజల్?

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం ప్రభాస్ 'జాన్' సినిమా చేస్తున్నాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆ మధ్య ఇటలీలో కొంతవరకూ షూటింగ్ చేసుకుని వచ్చారు. తదుపరి షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. యూరప్ నేపథ్యానికి సంబంధించిన సెట్స్ ను సిద్ధం చేస్తున్నారు.

ఈ సెట్స్ సిద్ధం కాగానే మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడే జరగనుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతిథి పాత్రలో కాజల్ కనిపించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ జోడిగా కాజల్ 'డార్లింగ్'.. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో గల సాన్నిహిత్యం కారణంగా .. ఈ ప్రాజెక్టుకి గల క్రేజ్ వలన అతిథి పాత్రకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు.
Go Back to Shorts
Kajal Agarwal

More Telugu News