Yuvraj Singh: శుభాకాంక్షలు భార్యామణి గారూ!: యువరాజ్ సింగ్

శుభాకాంక్షలు భార్యామణి గారూ అంటూ టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తన భార్య హజల్‌ కీచ్‌ ను ఉద్దేశించి ఓ పోస్ట్‌ చేశాడు. తమ వివాహం జరిగి మూడేళ్లే అయ్యిందని, అయితే, తనకు మాత్రం ముప్పై ఏళ్లు అయినట్లుందని ఆయన పేర్కొన్నాడు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన భార్యతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశాడు.

యువీ జంటకు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.  పాజీ అండ్‌ హజల్‌ కీచ్‌కి శుభాకాంక్షలు అంటూ క్రికెటర్ శిఖర్‌ ధావన్‌  ట్వీట్ చేశారు. హర్భజన్‌ సింగ్, డేవిడ్‌ వార్నర్‌ వంటి పలువురు క్రికెటర్లు కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2016, నవంబర్‌ 30న వారికి పెళ్లి జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు యువీ వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. దేశవాళీ లీగ్‌లో మాత్రం ఆడుతున్నాడు.
Yuvraj Singh
Cricket
mumbai

More Telugu News