దుకాణంలో దొంగతనం... డబ్బును వదిలేసి ఉల్లిగడ్డలు చోరీ!
- పశ్చిమ బెంగాల్ లో ఘటన
- రూ.50 వేల విలువైన ఉల్లిగడ్డలు చోరీ
- లబోదిబోమన్న దుకాణదారు
గల్లాపెట్టెలో డబ్బు భద్రంగానే ఉంది కానీ, రూ.50 వేల విలువైన ఉల్లిగడ్డల బస్తాలు మాయం అయ్యాయి. ప్రస్తుతం బెంగాల్ మార్కెట్లో ఉల్లిధర రూ.100కి పైగా పలుకుతోంది. డిమాండ్ ఉన్నప్పుడే సొమ్ము చేసుకుందామనుకున్న అక్షయ్ దాస్ ఆశలను దొంగలు అడియాసలు చేశారు.