ప్రియాంక రెడ్డి ఘటనతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.. మంత్రుల వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి: జానారెడ్డి

  • ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలి
  • ఐపీఎస్ అధికారితో వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి 
  • ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించాలి
ప్రియాంకరెడ్డి హత్య కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రియాంక రెడ్డి హత్య కేసు వంటి ఘటనలతో తెలంగాణలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారని అన్నారు. ఆడపిల్లలు బయటికెళితే ఇంటికొచ్చే వరకు తల్లిదండ్రులు భయపడుతూనే ఉంటున్నారని చెప్పారు.

ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని జానారెడ్డి విమర్శించారు. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా ఐపీఎస్ అధికారితో వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి స్పందించి, బాధిత కుటుంబాలను పరామర్శిస్తే బాగుంటుందని చెప్పారు.
Go Back to Shorts
Hyderabad
Crime News
Jana Reddy

More Telugu News