సంచలన విషయాలు వెలుగులోకి.. పక్కా ప్లాన్ తో ప్రియాంకారెడ్డిపై అత్యాచారం.. స్కూటీ టైర్ ను కావాలనే పంక్చర్ చేసిన నిందితులు
- టోల్ గేట్ వద్ద ప్రియాంక బైక్ పార్క్ చేయడాన్ని గుర్తించిన నిందితులు
- ఆమె తిరిగి వచ్చేసరికి పంక్చర్ చేసిన వైనం
- సాయం చేస్తున్నట్లు నటించి కిడ్నాప్
టోల్ గేట్ వద్ద ప్రియాంకారెడ్డి తన బైక్ ను పార్క్ చేసి ఎక్కడికో వెళ్లింది. ఈ విషయాన్ని నిందితులు గమనించారు. ఆమె తిరిగిరాక ముందే ఆ స్కూటీ టైర్ ను నిందితులు పంక్చర్ చేశారు. అనంతరం ఆమె వచ్చి, స్కూటీ టైర్ పంక్చర్ అయిందని, ఇంటికి ఎలా వెళ్లాలని కంగారు పడింది. ఆ సమయంలో అక్కడకు వచ్చి, సాయం చేస్తున్నట్లు నటించిన నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డారని తెలిసింది.