Crime News: అందుకే మా పాప చనిపోయింది: పోలీసులపై ప్రియాంకారెడ్డి తండ్రి తీవ్ర ఆరోపణలు

షార్ట్స్‌లో చూడండి
పశు వైద్యాధికారిణి ప్రియాంకా రెడ్డి  హత్యాచారం ఘటనపై ఆమె తండ్రి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన కూతురు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో... తాను రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. అయితే, పోలీసులు సమయాన్నంతా వృథా చేశారని ఆరోపించారు. వారు సీసీ కెమెరాలు చూస్తూ కూర్చోవడం వల్లే తమ పాప ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు.

ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల స్పందన సరిగ్గాలేదని, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే మరో పోలీస్ స్టేషన్ కు వెళ్లమన్నారని తెలిపారు. మనిషి చనిపోయాక ఎన్ని బృందాలతో వెతికితే ఏం లాభమని ప్రశ్నించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన నిందితులకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
Crime News
Hyderabad

More Telugu News