టీవీ రిపోర్టర్ ను లైవ్ లో ముప్పుతిప్పలు పెట్టిన వరాహం!
- గ్రీస్ లో భారీ తుపాను
- వరదలో అతలాకుతలమైన ఏథెన్స్
- రిపోర్టింగ్ కు వెళ్లిన పాత్రికేయుకుడికి చుక్కలు చూపించిన పంది
మాంటికో ఎటు వెళితే అది కూడా అటే వెళుతూ అతడ్ని నానా తిప్పలు పెట్టింది. బాగా బలిసిన ఆ వరాహం ముట్టెతో నెడుతుండడంతో రిపోర్టర్ బాధ చెప్పనలవి కాలేదు. ఓవైపు లైవ్ లో యాంకర్, ఇతర ప్రెజెంటర్లు సిద్ధంగా ఉన్నా ఆ పంది నుంచి తప్పించుకోలేక సతమతమయ్యాడు. ఇది చూసి స్టూడియోలో ఉన్నవాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.