Andhra Pradesh: ఏపీ టీడీపీ నేతలకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ స్పీకర్ గౌరవాన్ని భంగపర్చేలా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అందాయి. స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈ నోటీసులు అందినట్టు సమాచారం. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ సభాహక్కుల నోటీసులను వారికి ఇవాళ పంపారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా వీరిద్దరూ వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతల ఆరోపణలు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
atchanaidu
kuna ravi

More Telugu News