Anil Kumar: టీడీపీ నేతలు తమ వంకర బుద్ధి మార్చుకోవాలి: ఏపీ మంత్రి అనిల్ కుమార్

షార్ట్స్‌లో చూడండి
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టు ఏరియాలో పర్యటించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. 2018 నాటికే పోలవరం పూర్తిచేస్తామని టీడీపీ నేతలు ప్రజలకు అబద్ధాలు చెప్పారని, కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయితే, 75 శాతం పనులు జరిగాయని చంద్రబాబునాయుడు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు.

దేవినేని ఉమ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. మానసికంగా ఇబ్బందులు పడుతున్న బాబు సింగపూర్ వెళ్లి చికిత్స చేయించుకోవడం మేలని వ్యంగ్యం ప్రదర్శించారు. టీడీపీ నాయకులు అవాస్తవాలు చెప్పి 23 స్థానాలకు వచ్చారని, ఇకనైనా తమ వంకర బుద్ధి మార్చుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు.
Go Back to Shorts
Anil Kumar
YSRCP
Andhra Pradesh
Telugudesam
Chandrababu

More Telugu News