ఇద్దరూ ఎమ్మెల్యేలే... నాలుగేళ్లు చిన్నవాడైన అంగద్ ను వివాహమాడిన అతిధి సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇద్దరూ ఎమ్మెల్యేలే... నాలుగేళ్లు చిన్నవాడైన అంగద్ ను వివాహమాడిన అతిధి సింగ్

  • రాయ్ బరేలీ ఎమ్మెల్యే అతిధి సింగ్
  • పంజాబ్ లో ఎమ్మెల్యేగా అంగద్ సింగ్
  • న్యూఢిల్లీలో వైభవంగా వివాహం
వధువు, వరుడు ఇద్దరూ ఎమ్మెల్యేలే. వారి వివాహం న్యూఢిల్లీలో వైభవంగా జరుగగా, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై, ఆశీస్సులు అందించారు. వారే యూపీలోని రాయ్‌ బరేలికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిధి సింగ్, పంజాబ్‌ లోని షహీద్ భగత్‌ సింగ్‌ నగర్ ఎమ్మెల్యే అంగద్ సింగ్‌. తనకన్నా వయసులో నాలుగేళ్లు పెద్దయినా, అతిధిని వివాహమాడేందుకు అంగద్ కు అడ్డంకులు రాలేదు. ఢిల్లీలోని జోర్బా హోటల్‌ వేదికగా వీరి పెళ్లి జరిగింది. ఇద్దరూ 2017లో తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికకావడం గమనార్హం. అంగద్ ఇప్పటికే అత్యంత పిన్నవయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.

ఇక అంగద్ తండ్రి, ఎమ్మెల్యే ప్రకాష్ సింగ్ సైనీ, అదితి తండ్రి ఎమ్మెల్యే అఖిలేష్ సింగ్, గత రెండు దశాబ్దాలుగా మంచి స్నేహితులు. గత సంవత్సరం డిసెంబర్ లో వీరిద్దరికీ వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించగా, ఆ నెలలోనే నిశ్చితార్థం జరిగింది. వివాహానంతరం ఈ 25వ తేదీన ఈ జంట భారీ రిసెప్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 వేల మంది వరకూ హాజరవుతారని అంచనా.
Angad Singh
Athidhi singh
Marriage
New Delhi

More Telugu News