నాగబాబుగారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు: 'జబర్దస్త్' అదిరే అభి
- మా మధ్య మనస్పర్థలు లేవు
- మేము వర్గాలుగా ఏర్పడలేదు
- మార్పు అనేది సహజమన్న అభి
ఈ విషయాన్ని గురించి 'అదిరే అభి' మాట్లాడుతూ .. "మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. ఇక్కడి నటులు వర్గాలుగా ఏర్పడినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. దర్శకులు .. నటులు మారుతుండటమనేది సహజంగా జరిగేదే. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు .. హైపర్ ఆది వెళతాడని అనుకోవడం లేదు. మేము వెళ్లినా 'జబర్దస్త్' అనేది ఆగదు. ఇక నాగబాబుగారు బయటికి వెళ్లడం గురించి నేను స్పందించలేను. అది ఆయన స్వవిషయం .. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు" అని చెప్పుకొచ్చాడు.