dog: శునకాల పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు పలికిన సీఐఎస్‌ఎఫ్‌

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ( సీఐఎస్‌ఎఫ్‌) కే9 యూనిట్‌ సిబ్బంది.. జాగిలాల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి ఎనిమిదేళ్లుగా ఢిల్లీ మెట్రో పారామిలిటరీ విభాగంలో పనిచేశాయి. వాటిని ఇప్పుడు ఎన్జీవోలకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పతకాలతో వాటిని సత్కరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐఎస్‌ఎఫ్‌ తమ అధికారికి ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. వాటికి మెమొంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేసినట్లు వివరించింది.

  జాగిలాలకు ఇలా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయడం సీఐఎస్ఎఫ్‌ చరిత్రలో ఇదే ప్రథమం. జాగిలాలకు వీడ్కోలు పలికిన సీఐఎస్‌ఎఫ్‌ తీరుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇన్నాళ్లు సేవలందించినందుకు జాగిలాలకు థ్యాంక్స్ అని సీఐఎస్‌ఎఫ్‌ పేర్కొంది. జెస్సీ, లక్కీ, లవ్‌లీ జాగిలాలు అధికారికంగా విధుల నుంచి విరమణ పొందాయని వారు తెలిపారు.
 
Go Back to Shorts
dog
New Delhi

More Telugu News