చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో కలకలం.. సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు
- నలుగురు సిబ్బందిపై పడ్డ పెట్రోల్
- భూమి పట్టా మంజూరు చేయట్లేదని రైతు ఆవేదన
- రైతు కనకయ్య అరెస్టు
ఈ విషయాన్ని జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్.. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లారు. కనకయ్యపై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు రైతు కనకయ్యను అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంతో ఉలిక్కిపడ్డ రెవెన్యూ శాఖలో ఇటువంటి మరో ఘటన జరగడం విస్మయానికి గురి చేస్తోంది.