Jagan: ఏపీలో ఇసుక అక్రమ రవాణాపై టోల్‌ ఫ్రీ నంబరు.. తొలి కాల్ చేసిన సీఎం జగన్‌!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాను అరకట్టడానికి సీఎం జగన్.. 14500 టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభించారు. ఇసుక అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు ఉన్నా ఈ నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఈ టోల్‌ ఫ్రీ నంబరును ప్రారంభించిన వెంటనే జగన్.. 14500 నంబరుకు కాల్‌ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు.

కాల్‌ సెంటర్‌ ఉద్యోగులకు జగన్‌ పలు సూచనలు చేసి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ సురేంద్ర బాబు కూడా ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Telugudesam

More Telugu News