నేడు బద్రీనాథ్ ఆలయం మూత... ఆరు నెలలు ఇక మంచులోనే!

  • నేటి సాయంత్రం మూత
  • ఇప్పటికే దట్టంగా కురుస్తున్న మంచు
  • ఆరు నెలలు వెలగనున్న అఖండ జ్యోతి
హిమాలయ పర్వత సాణువుల్లో కొలువైన బద్రీనాథుని ఆలయం నేడు మూతపడనుంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మంచు కురుస్తూ ఉండటం, వచ్చే ఆరు నెలల పాటు ఆలయం పూర్తిగా మంచులో కూరుకుపోనున్న నేపథ్యంలో, ఈ సాయంత్రం సంప్రదాయ పూజల అనంతరం ఆలయాన్ని పూజారులు మూసివేయనున్నారు. తిరిగి వచ్చే సంవత్సరం వేసవి ప్రారంభమైన తరువాత ఆలయం తలుపులు తెరుస్తారు. కాగా, నేటి సాయంత్రం వెలిగించే అఖండ జ్యోతి, ఈ ఆరు నెలలూ గర్భగుడిలో వెలుగుతూనే ఉంటుంది. దీన్ని బద్రీనాథుని మహిమగా భక్తులు నమ్ముతుంటారు. ఇక సీజన్ చివరి రోజు కావడంతో ఆదివారం నాడు స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 
Go Back to Shorts
Badrinath
Temple
Jyothi
snow

More Telugu News