Chandrababu: వైసీపీ అరాచకాలను జాతీయస్థాయిలో ఎండగట్టాం: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోమారు విరుచుకుపడ్డారు. నవరత్నాల పేరుతో ఆ పార్టీ 9 రకాల మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. ఆ పార్టీ అరాచకాలను జాతీయస్థాయిలో ఎండగట్టినట్టు చెప్పారు. ఆ పార్టీ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.  

టీడీపీ యువ నేతలతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. పార్టీలోని 33 శాతం పదవులను 35 ఏళ్ల లోపు వారికే ఇస్తామని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమంపైనే దృష్టి పెట్టామని, ఓట్లపై పెట్టలేదని అన్నారు. అభివృద్ధిని చూసి ఓట్లేస్తారని భావించామని చంద్రబాబు అన్నారు. తాము ఓట్లపైనే దృష్టి పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు అన్నారు.
Go Back to Shorts
Chandrababu
YSRCP
Telugudesam
Jagan
Andhra Pradesh

More Telugu News