amaravathi: రాజధాని ఎక్కడో కమిటీనే చెబుతుంది!: బొత్స సత్యనారాయణ

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం కమిటీ వేశామని, అది ఇచ్చే నివేదిక ఆధారంగానే రాజధానిని నిర్మిస్తామని అన్నారు. తాము వేసిన కమిటీ అన్ని జిల్లాల్లోనూ పర్యటిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధాని కోసం గత ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతం నిర్మాణాలకు అనువైనది కాదని మరోమారు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం చేయబోమని మంత్రి హామీ ఇచ్చారు. హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా కమిటీనే నిర్ణయిస్తుందని బొత్స స్పష్టం చేశారు.  
Go Back to Shorts
amaravathi
Andhra Pradesh
Botsa Satyanarayana

More Telugu News