ఈ నెల 10న కృష్ణా నది ఒడ్డున మహా రుద్రాభిషేకం.. ముఖ్య అతిథిగా సీఎం జగన్!
- మహా రుద్రాభిషేకంతో పాటు మహా భష్మాభిషేకం
- 8 అడుగుల మృతికా (మట్టి ) శివలింగానికి ప్రత్యేక పూజలు
- సీఎంతో పాటు హాజరుకానున్న ఇతర నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే సంకల్పంతో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం నాగ సాధువులతో, వేద పండితులతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నాయకులు పాల్గొననున్నారు.