ప్రేమిస్తున్నానని చెప్పి, టెన్త్ చదివే అమ్మాయి నుంచి రూ. 5 లక్షలు నొక్కేశాడు!

  • మాయమాటలతో బాలికను నమ్మించిన యువకుడు
  • పలుమార్లు ఇంట్లో డబ్బు దొంగిలించిన బాలిక
  • గట్టిగా నిలదీయడంతో విషయం బయటకు
పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి, ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి, పలుమార్లుగా మొత్తం రూ. 5 లక్షలు గుంజిన స్కూల్ ఉద్యోగి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్, సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా కొరివిని గూడెం గ్రామానికి చెందిన సుమంత్‌ రెడ్డి చైతన్యపురిలో ఉంటూ, ఓ స్కూల్లో రికార్డు అసిస్టెంట్‌ గా పనికి కుదిరాడు. అదే స్కూల్ లో చదువుకుంటున్న ఓ విద్యార్థినితో గత సంవత్సర కాలంగా చనువుగా ఉంటున్నాడు.

ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తాను ఎంటెక్ చదువుతున్నానని, దానికి ఫీజు కట్టాలని ఓ మారు, బైక్ కావాలని మరోమారు, ఇతర అవసరాలకంటూ... ఇలా పలుమార్లు మాయమాటలు చెప్పి డబ్బులడిగితే, బాలిక నమ్మి, ఇంట్లో దాచిన డబ్బును దొంగిలించి తెచ్చిచ్చింది. ఇంట్లోని డబ్బు మాయం కావడాన్ని గమనించిన బాలిక తండ్రి, గట్టిగా నిలదీయగా, అసలు విషయం బయటకు వచ్చింది. ఆపై ఆయన పోలీసులను ఆశ్రయించగా, సుమంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్ కు తరలించారు.
Go Back to Shorts
Girl
Student
Love
Affair
Police
Hyderabad

More Telugu News